శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫెర్న్డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. భూకంపం ధాటికి హంబోల్డ్ట్ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందిన అధికారులు తెలిపారు.
దీంతో 12 వేల మందికిపైగా అంధకారంలో చిక్కుకుపోయారని చెప్పారు. వాణిజ్య సముదాయాలు, ఇండ్లకు విద్యుత్ నిలిచిపోయిందన్నారు. భూకంపం వల్ల ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, కొన్ని బిల్లడింగులు, రహదారులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.