Earthquake | చిలీలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం..
భారీ భూకంపంతో చిలీ (Chili) వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది.
శాంటియాగో: భారీ భూకంపంతో చిలీ (Chili) వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం కాక్వింబోకు (Coquimbo) 41 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 41 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. అయితే రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.
చిలీని రింగ్ ఆఫ్ ఫైర్‌గా (Ring of Fire) పిలుస్తారు. పసిఫిక్ తీరంలో (Pacific ocean) ఉన్న ఈ దేశం అగ్నిపర్వతాలకు (Volcano) నెలవుగా ఉన్నది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2010లో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల 526 మంది మరణించారు. భూకంపం ధాటికి భారీ సునామీ కూడా వచ్చింది. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Chili
- Coquimbo
- Earthquake
- Epicenter
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

