లాహోర్ : లష్కరే తాయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్లో గురువారం కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన అమీర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. లాహోర్లోని ఒక న్యూస్ చానల్ కార్యాలయం వెలుపల ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.