పెంపుడు జంతువు ఉంటే, అద్దె అదనం.. యజమాని వింత షరతు

లండన్: పెంపుడు జంతువు ఉంటే అదనపు అద్దె చెల్లించాలని ఒక యజమాని వింత షరతు విధించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెంపుడు జంతువుల యజమానులకు అద్దె ఇంటి కష్టాలు తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త మోడల్ అద్దె ఒప్పందాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పెంపుడు జంతువులను అద్దె ఇండ్లలోకి యజమానులు నిషేధించలేరని పేర్కొంది. ఈ కొత్త నిబంధన ప్రకారం పెంపుడు జంతువులకు సంబంధించిన సమ్మతి ఒప్పందంలో డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే అద్దెకున్న వ్యక్తి పెంపుడు జంతువు కోసం అభ్యర్థిస్తే యజమాని తన అభ్యంతరంపై కారణాన్ని 28 రోజుల్లో లిఖిత పూర్వకంగా తెలియజేయాలి.
ఈ నిబంధన నేపథ్యంలో ఒక యజయాని వినూత్నంగా షరతు విధించాడు. పెంపుడు జంతువుల కోసం అదనపు అద్దె చెల్లించాలని ఒప్పందంలో పేర్కొన్నాడు. పందిరంలో పెంచే పక్షులు, గార్డెన్లో పెంచే పందులకు నెలకు పది పౌండ్లు (రూ.1018) , ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే కుక్క, పిల్లి, కుందేలు వంటి వాటి కోసం నెలకు 25 పౌండ్ల (రూ.2,542)ను అదనంగా చెల్లించాలన్న నిబంధన పెట్టాడు.

కాగా, పెంపుడు జంతువులకు అదనపు అద్దె చెల్లించాలన్న ఈ షరతు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా దారుణమని కొందరు నెటిజన్లు విమర్శించారు. అయితే, పెంపుడు జంతువులు ఉన్నవారికి అద్దెకు ఇల్లు లభించని తరుణంలో ఇది సమంజసమేనని మరి కొందరు సమర్థించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

