Japan: జపాన్ మాజీ ప్రధానిపై దాడి కేసు నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష
Japan: జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదాపై దాడి చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న కిషిదాపై నాటు బాంబుతో కిమురా అనే వ్యక్తి అటాక్ చేశాడు. మాజీ ప్రధాని షింజో అబెపై హత్యాయత్నం జరిగిన ఏడాదిలోనే ఈ ఘనట చోటుచేసుకున్నది.
టోక్యో: జపాన్(Japan) మాజీ ప్రధాని ఫుమియో కిషిదాపై 2023లో నాటు బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు రుజి కిమురాకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. వకయామా నగరంలో పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అప్పటి ప్రధాని కిషిదాపై బాంబు దాడి జరిగింది. కిమురా తన వద్ద ఉన్న నాటు బాంబును ప్రధాని మీదకు విసిరాడు. అయితే ఆ పేలుడులో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. పేలుడు పదార్ధాలు, ఆయుధాలు కలిగి ఉన్న కేసులో .. కిమురాకు శిక్షను ఖరారు చేశారు. అతనిపై మొత్తం అయిదు అభియోగాలు నమోదు చేశారు.
పైప్ బాంబుతో దాడి చేసిన కేసులో వకయామా జిల్లా కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 2023, ఏప్రిల్ 15వ తేదీన సాయికజకి ఫిషింగ్ పోర్టు వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అటాక్ జరిగింది. అయితే 2022 జూలైలో మాజీ ప్రధాని షింజో అబెపై దాడి జరిగిన ఏడాది లోపే ఈ ఘటన చోటుచేసుకున్నది. కిమురాకు 15 ఏళ్ల జైలుశిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. కిషదాపై దాడి చేయడానికి ఓ నెల రోజుల ముందు నిందితుడు ఆ పేలుడు పదార్ధాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది.
హాని చేయాలన్న ఉద్దేశంతో పేలుడు పదార్ధాన్ని విసరలేదని, కేవలం తన కోర్టు కేసుపై అందరి దృష్టి పడాలన్న ఉద్దేశంతో అటాక్ చేసినట్లు చెప్పాడు. పైప్ బాంబు ద్వారా కేవలం పొగ వస్తుందని భావించినట్లు తెలిపాడు. ఎగువ సభ ఎన్నికల విషయంలో కనీస వయసు అర్హతను తగ్గించాలని కోరుతూ నిందితుడు కిమురా కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే ఆ కేసును కోర్టు కొట్టివేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

