లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer) రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నేతగా కూడా రిజైన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తమ పార్టీకి కొత్త నేతను ఎంపిక చేసే వరకు తాత్కాలికగా ప్రధానిగా స్టార్మర్ కొనసాగనున్నారు. మరికొన్ని వారాల్లో కొత్త నేతను ఎన్నుకోనున్నారు. 2024లో ఆయన నేతృత్వంలో లేబర్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ రెండేళ్లలోనే ఆయనతో పాటు పార్టీ పాపులారిటీ కూడా తగ్గిపోయింది. గత వారం జరిగిన ఎన్నికల్లో ఆండీ బర్న్‌హమ్ .. ప్రత్యేక ఎన్నికల్లో గెలిచారు. గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన ఆయన. లేబర్ పార్టీ నాయకత్వ పాత్రకు పోటీపడనున్నారు.
రెండేళ్ల క్రితం డౌనింగ్ స్ట్రీట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం జీవితంలో గర్వించదగ్గ సందర్భం అని తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరుచాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు ఆయన చెప్పారు. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థను పునరుత్తేజం చేసినట్లు స్టార్మర్ తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా తీసిన లేబర్ పార్టీకి జీవం పోశానన్నారు. పార్టీ పని అయిపోయిందన్న వారికి.. ఆ వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారన్నారు.
రాజీనామాపై ఇవాళ ఉదయం బ్రిటన్ రాజుతో చర్చించినట్లు ఆయన చెప్పారు. లేబర్ పార్టీ నాయకత్వం కోసం నామినేషన్లు స్వీకరించాలని చెప్పానన్నారు. అయితే సెప్టెంబర్‌లో కొత్త నేత వచ్చే వరకు స్టార్మర్ తాత్కాలిక ప్రధానిగా చేయనున్నారు.