85 నిమిషాల పాటు అమెరికా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్
Kamala Harris | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హ్యారిస్( Kamala Harris ) రికార్డు సృష్టించారు. శుక్రవారం రోజు ఒక గంటా 25 నిమిషాల పాటు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలిగా కొనసాగారు.

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హ్యారిస్( Kamala Harris ) రికార్డు సృష్టించారు. శుక్రవారం రోజు ఒక గంటా 25 నిమిషాల పాటు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలిగా కొనసాగారు. కమలా హ్యారిస్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోన్న విషయం విదితమే.
అయితే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొలనోస్కోపీ కోసం శుక్రవారం అనస్థీషియా తీసుకున్నారు. కొలనోస్కోపీ చికిత్స సమయంలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని జో బిడెన్‌కు వైద్యులు చెప్పారు. దీంతో తన అధ్యక్ష బాధ్యతలను ఆ సమయం వరకు కమలా హ్యారిస్‌కు అప్పగించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కమలా హ్యారిస్ ఆ సమయంలో వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్‌లో ఉన్న తన కార్యాలయం నుంచే పనిచేశారు. 250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన దాఖలాలు లేవు.
అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వహించే పరిస్థితిలో లేకపోతే తన అధికారాలను మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగానే ఆ కొంత సమయం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్ కొనసాగారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

