Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
Jordan Church : పశ్చిమాసియా దేశమైన జోర్డాన్‌లోని ఒక చర్చిలో జరిగిన కాల్పులు ఘటనలో ఏడుగురు మరణించారు. 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన జోర్డాన్, కరాక్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
Jordan Church : పశ్చిమాసియా దేశమైన జోర్డాన్‌లోని ఒక చర్చిలో జరిగిన కాల్పులు ఘటనలో ఏడుగురు మరణించారు. 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన జోర్డాన్ రాజధాని అమ్మాన్ పట్టణానికి, దక్షిణాన 90 మైళ్ల దూరంలో ఉన్న కరాక్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. కరాక్ గవర్నరేట్ వద్ద గల హామౌడ్ అనే చర్చిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డాడు.
ఒక అంత్యక్రియల కార్యక్రమం జరుగతుండగా కాల్పులు జరిపాడు. వెహికల్లో వచ్చిన దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారని జోర్డాన్ ప్రభుత్వ ప్రతినిధి మొహమ్మద్ అల్ మొమాని వెల్లడించారు. మరో 10 మంది గాయపడ్డారు. వారిని అధికారులు స్థానిక ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు ఏకే-47 కలాష్నికోవ్ రైఫిల్‌తో కాల్పులకు పాల్పడ్డట్లు తెలిపారు.
కొన్ని నిమిషాలపాటు నిందితులు విచక్షణారహితంగా ఈ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక రక్షణ, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే, కాల్పులకు పాల్పడింది ఎవరు.. వారు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

