Johnson & Johnson: 9 బిలియన్ల డాలర్ల సెటిల్మెంట్కు జాన్సన్ కంపెనీ ప్రతిపాదన
Johnson & Johnson: జాన్సన్ కంపెనీ టాల్కమ్ పౌడర్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండేది. ఇప్పుడా ఉత్పత్తులు లభించడంలేదు. కానీ ఆ కంపెనీపై వేసిన కేసులు కోర్టుల్లోనే ఉన్నాయి. దీంతో ఆ కంపెనీ ఓ భారీ ప్రతిపాదన చేసింది. తమ కంపెనీపై ఉన్న కేసుల పరిష్కారం కోసం 9 బిలియన్ల డాలర్ల సెటిల్మెంట్కు రెఢీ అయ్యింది.
న్యూయార్క్: జాన్సన్ అండ్ జాన్సన్(Johnson & Johnson) కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడర్(baby powder)తో పాటు ఇతర ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు వేలాది మంది కేసులు దాఖలు చేశారు. అయితే ఆ కేసుల్లో సెటిల్మెంట్(settlement) కోరుతున్న జాన్సన్ కంపెనీ తాజాగా ఓ ప్రతిపాదన చేసింది. దివాళా కోర్టును ఆశ్రయించిన ఆ కంపెనీ.. మొత్తం కేసుల పరిష్కారం కోసం 9 బిలియన్ల డాలర్లు చెల్లించనున్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నది. ఒక్క అమెరికాలోనే సుమారు 40 వేల కేసులు జాన్సన్ కంపెనీపై ఉన్నట్లు తెలుస్తోంది.
తమ కంపెనీపై వేసిన కేసుల్ని విలువైనవే అని గుర్తిస్తున్నట్లు చెప్పిన ఆ కంపెనీ.. న్యాయపోరాటంలో భాగంగా సెటిల్మెంట్ను పెంచినట్లు అంగీకరించింది. గతంలో రెండు బిలియన్ల డాలర్లు ఇస్తానని చెప్పిన ఆ కంపెనీ ఇప్పుడు తన సెటిల్మెంట్ను 9 బిలియన్ల డాలర్లకు పెంచడం గమనార్హం. జాన్సన్ కంపెనీపై కేసు వేసిన 40 వేల మంది.. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు కారణమైన అస్బెస్టాస్(asbestos) ఉన్నట్లు ఆరోపణలు చేశారు.
2020 నుంచే అమెరికాలో ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్(talcum powder) అమ్మకాలను ఆపేశారు. ఇక గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల అమ్మకాన్ని ఆ కంపెనీ నిలిపివేసింది. బాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ దాదాపు 130 ఏళ్ల నుంచి తమ ఉత్పత్తుల్ని సేల్ చేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

