బైడెన్ శ్రీమతికి మోదీ ఖరీదైన బహుమతి!
ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాను సందర్శించిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సతీమణికి అందజేసిన బహుమతులలో అత్యంత ఖరీదైన వజ్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
వాషింగ్టన్, జనవరి 3: ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాను సందర్శించిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సతీమణికి అందజేసిన బహుమతులలో అత్యంత ఖరీదైన వజ్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది. 7.5 క్యారట్ సింథటిక్ వజ్రాన్ని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుని సతీమణి జిల్ బైడెన్‌కు అందజేశారు. దీని ఖరీదు దాదాపు రూ.17.15 లక్షలు ఉంటుంది. 2023 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుని కుటుంబం అందుకున్న బహుమతులలో ఇదే అత్యంత ఖరీదైనదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
2023లో బైడెన్ దంపతులకు పలువురు విదేశీ నాయకులు లక్షలాది రూపాయలు విలువచేసే బహుమతులను అందజేశారు. అయితే ఈ బహుమతులను బైడెన్ దంపతులు వ్యక్తిగతంగా ఉపయోగించుకునే అవకాశం లేదు. ఇవన్నీ వైట్ హౌస్‌కే చెందుతాయి.
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ దంపతులు ఈ వజ్రంతోపాటు ఇతర ఖరీదైన బహుమానాలను జాతీయ పురావస్తు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే అధ్యక్షుని భార్యకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

