బూస్టర్ డోస్ తీసుకున్న బైడెన్.. వ్యాక్సిన్ తీసుకోని పౌరులపై మండిపాటు
Washington | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు కూడా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలు దేశానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు.
దేశంలో కొంతమంది ప్రజలను కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తు్న్నారని, ఇలాంటి వారి వల్లే దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికా ప్రజల్లో 77 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పిన ఆయన.. ఇంకా పావుభాగం మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ‘‘నేను అంతలా కనిపించకపోయినా, నా వయసు 65 దాటింది’ అంటూ జోక్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

