H-1B Visa | భారతీయులకు బైడెన్ శుభవార్త.. హెచ్-1బీ వీసాలు సులభతరం
అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు గంటున్న భారత యువతకు బైడెన్ సర్కారు తీపికబురు చెప్పింది. అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దీనితోపాటు ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది.
- విద్యార్థి వీసాను హెచ్-1బీగా మార్చుకునేందుకు అవకాశం
- డీహెచ్ఎస్ నిబంధనల్లో మార్పులు
- జనవరి 17 నుంచి కొత్త నిబంధనలు
H-1B Visa | వాషింగ్టన్, డిసెంబర్ 18 : అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు గంటున్న భారత యువతకు బైడెన్ సర్కారు తీపికబురు చెప్పింది. అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దీనితోపాటు ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. దీంతో లక్షల మంది భారత టెక్ ప్రొఫెషనల్స్‌కు లబ్ధి చేకూరనున్నది. వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) క్యాటగిరీలోకి వచ్చే హెచ్-1బీ వీసా సాయంతో అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా భారీగా లబ్ధి పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) మంగళవారం కొత్త నిబంధనలను ప్రకటించింది. తద్వారా హెచ్-1బీ వీసాల వార్షిక చట్టబద్ధ పరిమితి నుంచి మినహాయింపు పొందిన నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనాలు, నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో అమెరికన్ సంస్థలు తమ వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుని ప్రపంచ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు వీలవుతుంది. కొత్త విధానంలో లేబర్ కండీషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

