వాషింగ్టన్ : వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ఈ మేరకు మూడు నిమిషాల ప్రచార వీడియోను మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు, సామాజిక భద్రత అనేవి 2024 ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు.
‘ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఓటుహక్కు, పౌర హక్కుల కోసం ప్రతితరం నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే అమెరికా అధ్యక్ష పదవి కోసం మరోసారి పోటీపడుతున్నా’ అని బైడెన్ అన్నారు. కమలా హ్యారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తారని వెల్లడించారు.