e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News రిపోర్ట‌ర్ల‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్

రిపోర్ట‌ర్ల‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్

రిపోర్ట‌ర్ల‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ స‌తీమ‌ణి, ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్ .. ఎయిర్‌ఫోర్స్ వ‌న్ సిబ్బందిని ఏప్రిల్ ఫూల్ చేశారు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్ట‌న్‌కు విమానంలో తిరుగు ప్ర‌యాణం అవుతున్న స‌మ‌యంలో.. జిల్ బైడెన్ ఓ ఫ్ల‌యిట్ అటెండెంట్ రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. బ్లాక్ డ్రెస్సు, బ్లాక్ మాస్క్ పెట్టుకుని చేతిలో ఐస్‌క్రీమ్ ప‌ట్టుకున్ని.. ఆ విమానంలో ఉన్న రిపోర్ట‌ర్లు, వైట్‌హౌజ్ సిబ్బంది, సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్ల‌కు ఆమె స‌ర్వ్ చేశారు. జాస్మిన్ అని నేమ్‌ట్యాగ్ పెట్టుకున్న జిల్ బైడెన్‌.. ఫ్ల‌యిట్ అటెండెంట్ గా అంద‌ర్నీ బోల్తా కొట్టించారు. సిబ్బంది క్యాబిన్ల‌కు వెళ్లి ఐస్‌క్రీమ్ ఇచ్చిన జిల్ బైడెన్‌.. అయిదు నిమిషాల త‌ర్వాత ప్రెస్ సెక్ష‌న్‌లో మ‌ళ్లీ క‌నిపించారు. అయితే అక్క‌డ‌కు వ‌చ్చిన ఆమె.. త‌న విగ్‌ను తొల‌గించారు. మాస్క్ తీసివేయ‌డంతో త‌మ‌కు ఐస్‌క్రీమ్ ఇచ్చింది ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్ అని గ్ర‌హించారు. ఏప్రిల్ ఫూల్ అంటూ రిపోర్ట‌ర్ల‌ను ఆమె థ్రిల్ చేశారు. అయితే గ‌తంలోనూ జిల్ బైడెన్ విమాన సిబ్బందిని ఫూల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బైడెన్ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనూ జిల్‌.. ఆయ‌న క్యాబిన్‌లోకి వెళ్లి భూమ్ అంటూ అరిచి అంద‌ర్నీ హ‌డ‌లెత్తించారు. గురువారం జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల విమాన సిబ్బంది మాట్లాడుతూ తాము ఫ‌స్ట్ లేడీ జిల్‌ను గుర్తించ‌లేక‌పోయామ‌న్నారు. జిల్ స‌ర్వ్ చేసిన వ‌నీలా ఐస్‌క్రీమ్ బార్లు బాగున్నాయ‌న్నారు.

Advertisement
రిపోర్ట‌ర్ల‌ను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement