ఎఫ్-15ఈని కూల్చిన ‘జెల్లీఫిష్’ డ్రోన్లు!
వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ కథలా ఉంటుంది. ఆకాశంలో ఒకదానితో ఒకటి అనుసంధానమై జెల్లీఫిష్ని పోలిన ఆకృతిలో కలిసి కదులుతూ అనేక డ్రోన్లు గాలిలో తేలుతూ కనిపిస్తాయి.
- ఇరాన్ వద్ద అధునాతన డ్రోన్ల వ్యవస్థ
వాషింగ్టన్, జూన్ 24: వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ కథలా ఉంటుంది. ఆకాశంలో ఒకదానితో ఒకటి అనుసంధానమై జెల్లీఫిష్ని పోలిన ఆకృతిలో కలిసి కదులుతూ అనేక డ్రోన్లు గాలిలో తేలుతూ కనిపిస్తాయి. ఈ ఏప్రిల్‌లో ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కూలిపోవడం వెనుక ఈ డ్రోన్ల సమూహమే ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఈ విమానం నుంచి బయటపడిన పైలట్‌ను అమెరికా ప్రత్యేక దళాలు రక్షించాయి. ఆ పైలట్ వెల్లడించిన వివరాలు ఇరాన్ డ్రోన్ సామర్థ్యం భారీ పురోగతిని సూచిస్తున్నదని సీఎన్ఎన్ వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం సందర్భంగా ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఘటనకు కారణమేమిటో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఈ ఘటన ఇరాన్ యుద్ధంలో కీలక ఘట్టంగా మారింది. విమానం పైలట్‌ను, వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ని కాపాడేందుకు అమెరికా కమాండోలు ఇరాన్ లోపల అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టారు. అయితే పైలట్ ఇచ్చిన వాంగ్మూలం అమెరికా నిఘా వర్గాల్లో కలకలం సృష్టించింది.
ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్‌కు చెందిన మజీద్ ఇన్ఫ్రారెడ్ గగనతల రక్షణ వ్యవస్థ లేదా క్షిపణులు కూల్చివేసి ఉంటాయని తొలుత అమెరికా భావించింది. అయితే ఒకవేళ ఆ విమానం నిజంగానే జెల్లీఫిష్ వంటి డ్రోన్ల సమూహం దాడిలో కూల్చివేతకు గురై ఉంటే అది ఇరాన్ వద్ద ఉన్న అత్యున్నత డ్రోన్ల సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. ఇది ఇంతకుముందు చైనా, రష్యాల వద్ద మాత్రమే ఉందని అమెరికా విశ్వసిస్తున్నది. అనేక డ్రోన్లు ఒకదానికొకటి అనుసంధానమై పెద్ద డ్రోన్ కింద కాళ్లలాగా చిన్న డ్రోన్లతో ఒకే యూనిట్‌గా కదులుతున్నాయి. ఇది నిజంగా గ్రహాంతరవాసుల వ్యవహారం అని పైలట్ వాంగ్మూలం గురించి తెలిసిన వర్గాలు సీఎన్ఎన్కు తెలిపాయి. నిఘా వర్గాలు మాత్రం పైలట్ వాంగ్మూలాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఆయన చెప్పిందే నిజమైతే అటువంటి వ్యవస్థను కలిగి ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇరాన్ ఒకటి అవుతుందని వారు చెప్పారు.
ఈ చిన్న డ్రోన్లను మదర్షిప్ డ్రోన్ అని పిలిచే ఒక డ్రోన్ నియంత్రిస్తుంది. ఈ మదర్షిప్ డ్రోన్ ఒక కమాండ్ ప్లాట్‌ఫామ్‌లా పనిచేస్తుంది. చిన్న డ్రోన్లు దాని కింద ఉంటాయి. ఈ సమూహం కలిసి కదలగలదు. దీనివల్ల దూరం నుంచి చూసినపుడు ఇది జెల్లీఫిష్‌లాగా కనిపిస్తుంది. బహుశా పైలట్ ఇదే చూసి ఉండవచ్చు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు చిన్న డ్రోన్లు ఉపగ్రహ లేదా మెష్ నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానం కావడానికి వీలు కల్పించే సాంకేతికతలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించడానికి ఇటువంటి మెష్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- F-15E
- iran
- Jellyfish drones
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

