JD Vance : అమెరికాతో ఆటలు ఆడాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇరాన్‌ను హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించినందున శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని స్పష్టం చేశారు. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమయంలో ఇరాన్ తమతో ఆటలు ఆడాలని చూస్తే సహించబోమని వాన్స్ స్పష్టం చేశారు.
ఆరు వారాలుగా క్షిపణుల మోతతో అట్టుడికిన పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించిన అమెరికా టెహ్రాన్‌తో దౌత్యపరమైన చర్చలకు సిద్ధమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉన్నత స్థాయి బృందంతో కలిసి శుక్రవారం పాకిస్థాన్ బయల్దేరారు. టెహ్రాన్‌తో చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను అని పాకిస్థాన్‌కు వెళ్లడానికి ముందు వాన్స్ పేర్కొన్నారు.
🚨 BREAKING: U.S. Vice President JD Vance has just departed aboard a plane from Washington, D.C., heading to Pakistan
Vance will meet directly with the Iranians for peace talks, leading the United States delegation. pic.twitter.com/3HLLzA6j0e
— GBX (@GBX_Press) April 10, 2026
‘టెహ్రాన్‌తో దౌత్యపరమైన చర్చల విషయమై అధ్యక్షుడు ట్రంప్ మాకు కీలకమైన సూచనలు చేశారు. ఆయన మాట ప్రకారం ఇరాన్ విశ్వసనీయతతో చర్చలు జరిపితే మేము సానుకూలంగా స్పందిస్తాం. అలా కాకుండా వారు మాతో ఆటలు ఆడాలనుకుంటే మాత్రం చర్చలకు వచ్చిన బృందం వారి మాట అస్సలు వినదు. అయితే.. మేము మాత్రం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు సానుకూలంగా జరగడానికి ప్రయత్నిస్తాం’ అని వాన్స్ వెల్లడించారు. అమెరికా, టెహ్రాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా దౌత్యపరమైన చర్చలకు చాలా ప్రాధాన్యం ఉంది. వాన్స్‌తో పాటు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్లతో కూడిన బృందం పాక్ ప్రధాని మధ్యవర్తిత్వంలో టెహ్రాన్ ప్రతినిధులుతో చర్చలు జరుపనుంది.
#BREAKING : JD Vance has departed for Pakistan to lead the United States delegation in high-stakes peace talks with Iran aimed at reinforcing a fragile ceasefire.
Ahead of the negotiations, Vance said he was “looking forward” to the talks and expressed optimism about a positive… pic.twitter.com/FPDIQWH8gR
— upuknews (@upuknews1) April 10, 2026