Biomethane | టోక్యో: ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్‌తో జపాన్ సైంటిస్టులు రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్ అయ్యాయని జపాన్ స్పేస్ స్టార్టప్ ‘ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్’ (ఐఎస్టీ) గురువారం ప్రకటించింది.
హోకైడోలోని ‘హోకైడో స్పేస్‌పోర్ట్ లాంచ్ కాంప్లెక్స్’లో సైంటిస్టులు ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. ‘సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే లిక్విడ్ బయోమీథేన్ ఆధారిత రాకెట్ ఇంజిన్ల ఖర్చు చాలా తక్కువని ఐఎస్టీ తెలిపింది.