కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించిన సిబ్బంది.. క్షమాపణలు చెప్పిన ఆరోగ్యశాఖ మంత్రి

టోక్యో: జపాన్‌కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి నోరిహిషా తమురా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రిత్వశాఖకు చెందిన ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి పార్టీ చేసుకోవడం పట్ల స్థానిక మీడియాలో కథనం వచ్చింది. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన ఆ సిబ్బంది పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్చి 24వ తేదీన ఆరోగ్యశాఖకు చెందిన 23 మంది ఉద్యోగులు లేట్ నైట్ డిన్నర్లో పాల్గొన్నారు. అయితే ఆ అంశాన్ని విచారించనున్నట్లు ఆయన తెలిపారు. టోక్యోతో పాటు సమీప జిల్లాల్లో ఇటీవల ఎమర్జెన్సీ విధించారు. రాత్రి 9 గంటల తర్వాత రెస్టారెంట్లను ఓపెన్ చేయవద్దు అంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో గుమ్మికూడడాన్ని కూడా నిషేధించారు. గింజా జిల్లాలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఫేర్వెల్ పార్టీలో భాగంగా డిన్నర్ చేసినట్లు తెలిసింది. అయితే కొందరు రాత్రంతా ఆ రెస్టారెంట్లో ఉండడం వివాదానికి దారి తీసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

