Japan PM Kishida: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. కిషిదాకు తప్పిన ముప్పు
Japan PM Kishida: కిషిదాను టార్గెట్ చేశారు. పైప్ బాంబుతో అటాక్ చేశారు. అయితే జపాన్ ప్రధాని ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. ఓ మీటింగ్‌లో ప్రసంగం స్టార్ట్ చేయడానికి ముందే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా(Japan PM Kishida)కు పెను ప్రమాదం తప్పింది. వకయామా సిటీలో ప్రధాని కిషిదా ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగం స్టార్ట్ చేయడానికి కొన్ని సెకన్ల ముందే భారీ పేలుడు ఘటన జరిగింది. మీటింగ్ నిర్వహిస్తున్న నేతలపై స్మోక్ లేదా పైప్ బాంబును విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు.
https://twitter.com/yukiko_070/status/1647068891536048128?s=20
ప్రధాని మీటింగ్‌కు హాజరైన జనం.. బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడ ఉన్న వారంతా ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబు దాడిలో కిషదాకు ఎటువంటి నష్టం జరగలేదు. దీంతో ఆయన్ను అక్కడ నుంచి హుటాహుటిన తరలించారు.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వ్యక్తితో కిషిదా మాట్లాడుతున్న సమయంలో బాంబు పేలుడు ఘటన జరిగింది. స్మోక్ బాంబుతో అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. గత ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

