Japan earthquake | జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 6.1 తీవ్రత నమోదు
జపాన్‌లో హోన్షు ద్వీపకల్పంలో భూకంపం
జపాన్‌లో సోమవారం పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదయింది. జపాన్‌లోని పెద్ద ద్వీపకల్పమైన హోన్షుకి దక్షిణ తీరంలోని కన్సాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. మై ప్రెఫెక్టర్ దగ్గర సాయంత్రం 5ః30 గంటలకు 357 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
రాజధాని టోక్యోతో పాటు చుట్టు పక్కల నగరాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించిందని అమెరికాకు చెందిన యూనైటెడె స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ద్వీపకల్పంలో భూకంపం రావడంతో సునామీ వస్తుందేమోనని అధికారులు అనుకున్నారు. అయితే, అయితే, వాతావరణ శాఖ మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫుకుషిమా అణుఇంధన కేంద్రంలో ఎవరికీ గాయాలుగానీ, ప్రాణనష్టం కాని సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా బుల్లెట్ రైళ్లు, టోక్యో మెట్రోరైళ్లను నిలిపివేశారు. ఆ తర్వాత వాటిని పునరుద్దరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

