ఫ్రెంచ్ గయానా : జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నింగిలోకి దూసుకెళ్లింది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని స్పేస్‌సెంటర్ నుంచి భారీ టెలిస్కోప్‌ను నింగిలోకి పంపారు. ఈ వెబ్స్పేస్ విశ్వం పుట్టుక, తొలినాళ్లలో గెలాక్సీల గుట్టును విప్పనున్నది. అంతరిక్షంలోకి ప్రయోగించిన అతిపెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే వెబ్స్పేస్ రెండున్నర రెట్లు పెద్దది.
కంటికి కనిపించే నక్షత్రాలను వెయ్యి కంటే కోట్ల రెట్ల స్పష్టతతో ఈ భారీ టెలిస్కోప్ చూపనున్నది. హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్ల స్పష్టతతో ఫొటోలు తీయనున్నది. ఈ స్పేస్వెబ్ను నాసా, యూరోపియన్, కెనడా స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా రూపొందించాయి. 21 అడుగుల పొడవున్న భారీ టెలిస్కోప్‌ను రూ.75వేలకోట్ల ఖర్చు చేశారు. నక్షత్రాలు, పాలపుంతలతో పాటు బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలినాటి నక్షత్రమండలాలను వెబ్స్పేస్ సహాయంతో శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.