James Cleverly | బ్రిటన్ ప్రధాన మంత్రి (UK PM) రిషి సునాక్ (Rishi Sunak) కేబినెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విషయంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆ దేశ హోంశాఖ మంత్రి (UK home secretary) సుయిల్లా బ్రెవర్మాన్ (Suella Braverman)పై సునాక్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త హోంశాఖ కార్యదర్శిగా జేమ్స్ క్లీవర్లీ (James Cleverly)ని నియమిస్తూ సునాక్ తాజాగా నిర్ణయం వెల్లడించారు. జేమ్స్ గతేడాది సెప్టెంబర్ నుంచి విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సుయిల్లాపై వేటుతో ఆ శాఖను కూడా ఆయన భర్తీ చేయనున్నారు.
పాలస్తీనాకు అనుకూలంగా తీసిన ర్యాలీ విషయంలో పోలీసులు వ్యహరించిన తీరును ఖండిస్తూ మంత్రి బ్రెవర్మాన్ ఓ పత్రికలో వ్యాసం చేశారు. ఆ వ్యాసంలో ఆమె ప్రధాని సునాక్ తీరును తప్పుపట్టారు. పత్రిక వ్యాసంలో ఆ మంత్రి వెల్లడించిన అభిప్రాయాల వల్ల ఘర్షణలు మరింత ఉధృతం అయ్యాయి. దీంతో నిరసనకారులు లండన్ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. బ్రెవర్మాన్ ను వ్యక్తిగతంగా సమర్థించినా.. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు సునాక్ తెలిపారు.
Also Read..
Suella Braverman: మంత్రి బ్రెవర్మాన్పై వేటు.. క్యాబినెట్ నుంచి తొలగించిన రిషి సునాక్
Diwali Celebrations | కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న రిషి సునాక్.. వీడియో
Rishi Sunak | దీపావళి సందర్భంగా రిషి సునాక్కు ప్రత్యేక బహుమతి అందించిన కేంద్ర విదేశాంగ మంత్రి