Israel-Hamas War | కదన రంగంలోకి అధునాతన అస్త్రం ఐరన్బీమ్.. హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ సన్నాహాలు
హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ మరో అధునాతన అస్ర్తాన్ని కదన రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నది. హమాస్ మిలిటెంట్లు ఏకకాలంలో కురిపించిన రాకెట్ల వర్షాన్ని ఐరన్‌డోమ్ తట్టుకోలేకపోవడంతో భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసిన ఇజ్రాయెల్ మరో అధునాతన వ్యవస్థ ఐరన్బీమ్ను తీసుకొస్తున్నది.
- షెడ్యూల్ కంటే ముందుగానే అందుబాటులోకి
- లేజర్ కిరణాలతో శత్రువుల రాకెట్లను కూల్చే సాంకేతికత
- ఐరన్‌డోమ్ కంటే అత్యంత చౌకైన రక్షణ వ్యవస్థ
Israel-Hamas War | జెరూసలేం, అక్టోబర్ 16: హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ మరో అధునాతన అస్ర్తాన్ని కదన రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నది. హమాస్ మిలిటెంట్లు ఏకకాలంలో కురిపించిన రాకెట్ల వర్షాన్ని ఐరన్‌డోమ్ తట్టుకోలేకపోవడంతో భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసిన ఇజ్రాయెల్ మరో అధునాతన వ్యవస్థ ఐరన్బీమ్ను తీసుకొస్తున్నది. శత్రువుల రాకెట్లు, మోర్టార్లను ముందుగానే పసిగట్టి గాల్లోనే కూల్చివేసే ఈ వ్యవస్థను ఐరన్‌డోమ్‌తో పాటు సరిహద్దులో అతి త్వరలో మోహరించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నది.
ఏమిటీ ఐరన్బీమ్?
ఐరన్‌డోమ్ మాదిరిగానే ఐరన్బీమ్ కూడా శత్రువుల రాకెట్లు, మోర్టార్లు, విమానాలు, హెలికాఫ్టర్లను ముందుగానే పసిగట్టి గాల్లోనే కూల్చివేసే వ్యవస్థ. అయితే శత్రువుల రాకెట్లను కూల్చేందుకు ఐరన్డోమ్లో అత్యంత ఖరీదైన ఆయుధాలను వాడుతారు. కానీ ఐరన్బీమ్ లేజర్ కిరణాలను వినియోగించి శత్రువులను రాకెట్లను తుత్తునియలు చేస్తుంది. ఇజ్రాయెల్‌లోని రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తున్నది. దీన్ని 2025లో రంగంలోకి దించాలని ఇజ్రాయెల్ భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెంటనే బరిలోకి దించాలని ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నది.
ఐరన్‌డోమ్ కంటే ఐరన్బీమ్ మెరుగైందా?
- ఐరన్‌డోమ్‌కు ఇది ప్రత్యామ్నాయం
- ఐరన్‌డోమ్‌తో పొలిస్తే చాలా చవక.
- శత్రువుల రాకెట్లను కూల్చేందుకు ఐరన్డోమ్లో వాడే ఒక్కో ఆయుధం ఖరీదు 60 వేల డాలర్లు (రూ.48 లక్షలు). దీంతో పోలిస్తే ఐరన్బీమ్లోని లేజర్ కిరణాలతో రాకెట్లను కూల్చడం చాలా చవక. దీని ఖర్చు 3.5 డాలర్లు (రూ.280).
- శత్రువుల విమానాలను పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం చేసే వీలు.
- ఐరన్బీమ్ పరిమాణంలో చాలా చిన్నది. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా తరలించవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

