Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
Israel Elections | ఇజ్రాయెల్ తదుపరి ప్రధానమంత్రి ఎవరో ఈ నెల 27న జరిగే ఎన్నికలతో తేలనుంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారంలో కొనసాగుతారా? లేక గాడి ఐసెన్‌కోట్, నఫ్తాలి బెన్నెట్, యూయిర్ లాపిడ్ లేదా మన్సూర్ అబ్బాస్‌లలో ఎవరైనా పగ్గాలు చేపడుతారా? అన్నది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి.
Israel Elections | జెరూసలెం:ఇజ్రాయెల్ తదుపరి ప్రధానమంత్రి ఎవరో ఈ నెల 27న జరిగే ఎన్నికలతో తేలనుంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారంలో కొనసాగుతారా? లేక గాడి ఐసెన్‌కోట్, నఫ్తాలి బెన్నెట్, యూయిర్ లాపిడ్ లేదా మన్సూర్ అబ్బాస్‌లలో ఎవరైనా పగ్గాలు చేపడుతారా? అన్నది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 120 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 7 దాడి సమయంలో భద్రతా వైఫల్యాలు, పెరుగుతున్న జీవన వ్యయం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ప్రతిష్ఠ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమిలో జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్-గ్విర్‌కు చెందిన ఓట్జా యెహుదిత్ వంటి అతివాద పార్టీలతోపాటు, షాప్, యునైటెడ్ తోరా జడాయిజం వంటి అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలు ఉన్నాయి.
గెలుపు అవకాశాలు ఎవరికి?
యషార్ పార్టీ నాయకుడు గాడి ఐసెన్‌కోట్, బేయాహాద్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ ప్రధాని పదవికి పోటీపడుతున్నారు. సర్వేల ప్రకారం నెతన్యాహుతో ఐసెన్‌కోట్ పోటీ గట్టిగా ఉండగా, కొన్ని సర్వేల్లో ఆయన ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. సెప్టెంబర్ 8న వెల్లడైన పాలీ మార్కెట్ అంచనాల ప్రకారం.. ఐసెన్కోట్కు 51 శాతం, నెతన్యాహుకు 28 శాతం అవకాశాలున్నాయి. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం కూటమికి 54 స్థానాలు లభించే అవకాశం ఉన్నది. నెతన్యాహు నేతృత్వంలోని మితవాద, అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీల కూటమికి 48-49 స్థానాలు రావొచ్చని అంచనా. 120 మంది సభ్యులున్న నెస్సెట్‌లో 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ లెక్కన ఏ కూటమికీ సొంతంగా మెజారిటీ సాధించే అవకాశాలు లేవు. అరబ్ ప్రాబల్యం ఉన్న పార్టీలు సుమారు 13 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా. దీంతో ఈ పార్టీల మద్దతు కీలకం కానున్నది.
కూటములే కీలకం..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నెతన్యాహుకు మితవాద, అతివాద, అల్ట్రా ఆర్థడాక్స్ మిత్రపక్షాల మద్దతు అవసరం. ప్రతిపక్షం ప్రధాన పార్టీలకు మించి ఇతర పార్టీలతో చేతులు కలపాల్సి ఉంటుంది. అరబ్ నేతృత్వంలోని పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. వాటిని కూటమిలో చేర్చుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్ష నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఆ పార్టీల మద్దతును నెతన్యాహు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రధాని పీఠం ఎవదితో ఎన్నికల తర్వాతే తేలనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

