Israel attack | రఫా నగరంపై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్ సేనలు.. 45 మంది పౌరులు మృతి..!
Israel attack | పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై సేనలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Israel attack : పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై సేనలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు అల్ అహ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 30 మృతదేహాలను తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ వ్యాఖ్యానించారు. తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం.. మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

