ISIS | పాక్‌లో పార్టీ మీటింగ్‌పై ఆత్మాహుతి దాడి.. ఘాతుకానికి పాల్పడింది తామేనని ప్రకటించిన ఐసిస్
పాకిస్థాన్‌లోని (Pakistan) ఓ పార్టీ బహిరంగ సభలో భారీ పేలుడు సంభవించి 54 మంది దుర్మరణం చెందారు. అది పేలుడు కాదని.. తామే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) ప్రకటించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని (Pakistan) ఓ పార్టీ బహిరంగ సభలో భారీ పేలుడు సంభవించి 54 మంది దుర్మరణం చెందారు. అది పేలుడు కాదని.. తామే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) ప్రకటించింది. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తున్క్వా ప్రావిన్స్‌లోని బజౌర్ (Bajaur) జిల్లాలో ఇస్లామిక్ పార్టీ అయిన జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ (Jamiat Ulema-e-Islam-F) గత ఆదివారం బహిరంగ సభనిర్వహించింది. సభ జరుగుతుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో 23 మంది చిన్నారులు సహా 54 మంది మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు.

ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు తన జాకెట్లో ఉన్న డిటోనేటర్‌ను బహిరంగ సభలో పేల్చివేశాడని ఐఎస్ఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆత్మాహుతి దాడిలో భారీ సంఖ్యలో ప్రజలు గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

