లండన్: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్-2023ను ఐరిష్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ‘ప్రొఫెట్ సాంగ్’ పుస్తకానికి ఈ అవార్డు లభించింది. దీంతో ఐరిష్ నుంచి ఈ అవార్డు అందుకున్న ఐదో వ్యక్తిగా పాల్ లించ్ నిలిచారు.
పశ్చిమ దేశాల్లో అనిశ్చితిని గుర్తు చేయడమే కాకుండా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని పుస్తకంలో రచయిత ప్రస్తావించారు. ముఖ్యంగా భయంకర ప్రపంచంతో పోరాడుతున్న ఓ కుటుంబ గాథను వివరించారు. ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా పతనమయ్యాయో గుర్తు చేశారు.