Donald Trump | డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాను చంపేందుకు కుట్ర.. ఇరాన్లో శిక్షణ పొందిన ఇరాక్ ఉగ్రవాది అరెస్టు
Donald Trump : ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్, ఇరాక్ కలిసి పన్నిన కుట్ర బయటపడింది.
Donald Trump : ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్, ఇరాక్ కలిసి పన్నిన కుట్ర బయటపడింది. ఈ ఘటనలో ఇవాంకాను చంపేందుకు ప్రయత్నించిన తీవ్రవాదిని అమెరికా దళాలు అరెస్టు చేశాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌లోని సైనిక సంస్థ ఐఆర్జీసీ (ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్స్) ఒక ఇరాక్ వ్యక్తికి శిక్షణ ఇచ్చింది.
ఇవాంకా ట్రంప్‌ను చంపాలని లక్ష్యంగా ఎంచుకుంది. 2020లో అప్పటి ఇరాన్ కమాండర్ క్వాసెమ్ సోలేమనిని చంపినందుకు ప్రతిగా ట్రంప్ కూతురు ఇవాంకాను చంపేందుకు ఒక ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చింది. అతడి పేరు మొహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సాది (35). మొహమ్మద్‌ను టర్కీలో ఈ నెల 15న అరెస్టు చేశారు. అనంతరం అతడిని అమెరికాకు అప్పగించారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు మొహమ్మద్ బాకర్.. ఐఆర్జీసీ కమాండర్ సొలేమనిని గురువుగా భావించేవాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అతడు మరణించాడు.
దీంతో సొలేమనిని చంపినందుకు బదులు తీర్చుకోవాలని మొహమ్మద్ బాకర్ భావించాడు. దీనికి ట్రంప్ కూతురును చంపాలనుకున్నాడు. ఇక, అతడిని అమెరికా అధికారులు ప్రశ్నించగా.. ఫ్లోరిడాలోని ఇవాంకా ఇంటికి సంబంధించిన బ్లూప్రింట్ లభించింది. గతంలో తన సోషల్ మీడియాలో కూడా మొహమ్మద్ బాకర్ ఈ బ్లూప్రింట్ వివరాల్ని షేర్ చేశాడు. ట్రంప్ ఇంటిని పేల్చేయాలని కూడా అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- IRGC
- Ivanka Trump
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

