Hormuz Strait : పశ్చిమాసియా యుద్ధంలో రెండు వారాలు తాత్కాలిక కాల్పుల విరమణతో హర్మూజ్ జలసంధి (Hormuz Strait) గుండా రాకపోకలకు ఇక ఏ ఆటంకం ఉండదని భావించిన ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది ఇరాన్. అంత తేలికగా హర్మూజ్‌పై తమ పెత్తనాన్ని వదులుకునేందుకు ఇష్టపడని ఇరాన్ కొన్ని షరతులు విధిస్తోంది. రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతించాలని భావిస్తోంది. అంతర్జాతీయ రవాణాలో కీలకమైన ఈ జలసంధిని దాటాలంటే కొన్ని నియమాలు వర్తిస్తాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) మెలికి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
అమెరికా, ఇరాన్‌లు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించడంతో సంబురపడిన ప్రపంచ దేశాలకు అంతలోనే షాకింగ్ న్యూస్. ఇంతముందులా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణా కొనసాగడానికి ఇరాన్ అభ్యంతరం చెబుతోంది. టోల్ వసూలు చేయాలని భావించిన ఇరాన్.. తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు షరతులు విధిస్తోంది. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతిస్తామని పాకిస్థాన్‌తో చర్చలకు ముందే ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్త సంస్థ టీఏఎస్ఎస్కు స్పష్టం చేశాయి. ప్రతి నౌక హర్మూజ్‌ను దాటాలంటే అందుకు ఇరాన్ అనుమతితో పాటు కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించడం తప్పనిసరని వెల్లడించాయి.
🚨 BREAKING
🇮🇷⚓ Iran orders ALL ships transiting the Strait of Hormuz to coordinate with the Revolutionary Guard amid rising mine threats
Vessels are now being redirected to alternative routes inside the strait for safety as tensions escalate pic.twitter.com/mKapZQubi6
— WAR (@warsurv) April 9, 2026
ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నందున రోజుకు 15 నౌకలను మాత్రమే హర్మూజ్ సంధి గుండా వెళ్లనిస్తాం. ఇరాన్ అనుమతి, కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకే ఈ నౌకలు హర్మూజ్‌ను దాటుతాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియంత్రణ నియమాలను ఐఆర్జీసీ కనుసన్నల్లో జరుగుతాయి. నౌకల అనుమతికి సంబంధించి ఆయా దేశాలతో ఐఆర్జీసీ అధికారికంగా మాట్లాడుతుంది. యుద్ధానికి ముందులా హర్మూజ్‌ను దాటడం ఇక కుదరదు. యుద్ధం కారణంగా ఇతర దేశాల్లోని ఇరాన్ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ రెండు వారాల్లోగా వాటిని మాకు అప్పగించాలి అని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.
UPDATE: 🇮🇷🇺🇸 Traffic through the Strait of Hormuz remains limited.
JD Vance and his team are set to meet Iranian officials in Islamabad this weekend. pic.twitter.com/Jsh8dPXB7M
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 9, 2026