Iran President: రైసీపై అటాక్ జరగలేదు.. కూలగానే హెలికాప్టర్లో మంటలు
Iran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ హెలికాప్టర్‌పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్లో మంటలు వ్యాపించినట్లు మిలిటరీ విచారణాధికారులు పేర్కొన్నారు.
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు(Iran President) ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ హెలికాప్టర్‌పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్లో మంటలు వ్యాపించినట్లు మిలిటరీ విచారణాధికారులు పేర్కొన్నారు. సైనిక దళాలకు చెందిన జనరల్ స్టాఫ్ దీనిపై ప్రకటన రిలీజ్ చేశారు. అజర్బైజాన్ బోర్డర్ సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు మొత్తం ఆరు మంది మరణించారు. దాంట్లో విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. హెలికాప్టర్ కూలడాని ముందు కంట్రోల్ టవర్, హెలికాప్టర్ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణల్లో ఎటువంటి అనుమానం వ్యక్తం కాలేదని మిలిటరీ జనరల్ పేర్కొన్నారు.
హెలికాప్టర్ కూలడానికి 90 సెకన్ల ముందు ఆ హెలికాప్టర్‌కు ఎస్కార్ట్‌గా వెళ్తున్న మరో రెండు హెలికాప్టర్ల మధ్య చివరి కమ్యూనికేషన్ జరిగినట్లు అధికారులు తేల్చారు. హెలికాప్టర్‌పై ఫైరింగ్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఆ హెలికాప్టర్ వెళ్తున్న మార్గంలో కూడా ఎటువంటి మార్పు లేదన్నారు. పూర్తిగా మంచు పట్టిన పర్వత శ్రేణుల్లో ఎగిరిన బెల్ కంపెనీ హెలికాప్టర్ పర్వతాలపై కూలింది. ఆదివారం ప్రమాదం జరగ్గా.. సోమవారం ఆ ప్రాంతాన్ని గుర్తించారు. మాషాద్లో ఉన్న ఇమామ్ రీజా మసీదు వద్ద అధ్యక్షుడు రైసీ పార్దీవదేహాన్ని ఖననం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

