టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎక్కడ? ఆయన బతికే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఈ ప్రశ్నలన్నీ అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇరాన్ దేశ ప్రజలను వేధిస్తున్నాయి. ఖమేనీ ఆరోగ్యానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనంలో పలు సంచలన విషయాలు వెల్లడించింది.
మొజ్తబా ఖమేనీ శారీరకంగా గాయపడినప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతం ఒక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నదని, హార్ట్ సర్జన్ కూడా అయిన ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఎన్వైటీ తెలిపింది. ప్రస్తుతం ఐఆర్జీసీ కూడా ఆయనను కలిసే అవకాశం లేదు.