టెహ్రాన్: అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమాన పైలట్ ఒకరు ఇరాన్లో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే డేరింగ్ ఆపరేషన్ ద్వారా ఆ పైలట్‌ను రక్షించినట్లు అమెరికా ప్రకటించింది. నేవీ సీల్ టీమ్ 6 కమాండోలు ఆ ఆపరేషన్ చేపట్టారు. కానీ ఆ ఆపరేషన్‌పై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. తమ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియం(Enriched Uranium)ను ఎత్తుకెళ్లేందుకు అమెరికా ఆ ఆపరేషన్‌ను చేపట్టి ఉంటుందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాక్వేయి తెలిపారు. దీనిపై అల్ జజీరా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.
7 వేల అడుగల ఎత్తులో ఉన్న ఓ కొండ చీలికలో దాక్కున్న వెపన్స్ స్పెషలిస్టును అమెరికా రక్షించుకున్నది. కానీ ఆ డేరింగ్ ఆపరేషన్‌పై తమకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని బాక్వెయి అనుమానాలు వ్యక్తం చేశారు. ఖోగిలుయే, బోయర్-అహ్మద్ ప్రావిన్సులో తమ పైటల్ ఉన్నట్లు అమెరికా చెప్పిందని, అయితే సెంట్రల్ ఇరాన్లో తమ దళాలను అమెరికా దింపాలనుకున్నదన్నారు. కానీ బోయర్ ప్రావిన్సుకు, పైలట్‌ను రెస్క్యూ చేసిన ప్రాంతానికి చాలా దూరం ఉన్నట్లు బాక్వేయి తెలిపారు. యురేనియంను దొంగలించాలన్న ఉద్దేశంతో .. తమను తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఆ ఆపరేషన్ చేపట్టి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా ఆపరేషన్‌పై తమకు అనుమానాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ వద్ద సుమారు 450 కిలోల శుద్దీకరించిన యురేనియం ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద దాడులు జరిగినట్లు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇవాళ ద్రువీకరించింది. కానీ ఆ దాడుల్లో ప్లాంట్‌కు ఎటువంటి నష్టం జరగలేదని ఐఏఈఏ పేర్కొన్నది. శాటిలైట్ ఇమేజ్‌లు, ఆ ప్రాంతంపై ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి విభాగం తెలిపింది. అయితే ఆ ప్లాంట్‌కు సుమారు 75 మీటర్ల దూరంలో ఓ స్ట్రయిక్ జరిగినట్లు ఐఏఈఏ వెల్లడించింది. బీఎన్పీపీ వద్ద న్యూక్లియర్ ఫ్యూయల్ భారీ సంఖ్యలో ఉందని, ఇక్కడ సైనిక చర్య జరగడం వల్ల, తీవ్ర స్థాయిలో రేడియేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ హెచ్చరించారు. కానీ ఆ ఆపరేషన్‌లో అమెరికా సక్సెస్ కాలేదని ఇరాన్ అధికారి చెప్పారు.
Based on its independent analysis of new satellite imagery and detailed knowledge of the site, the IAEA can confirm recent impacts of military strikes close to Iran’s Bushehr Nuclear Power Plant (BNPP), including one just 75 metres from the site perimeter. The BNPP itself has not… pic.twitter.com/zWpp3IaFLW
— IAEA – International Atomic Energy Agency ⚛️ (@iaeaorg) April 6, 2026