Iran: విజయవంతంగా శాటిలైట్‌ను ప్రయోగించిన ఇరాన్
Iran:ఇరాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి స్పేస్ టగ్‌ను ప్రయోగించింది. స్వదేశీయంగా డిజైన్ చేసి, ఉత్పత్తి చేశారు. స్వంతగా తయారు చేసిన శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా ఈ పరీక్ష చేపట్టారు. సామన్-1తో పాటు క్యూబ్‌సాట్, ఓ రీసర్చ్ పేలోడ్ కూడా ఉన్నది.
టెహ్రాన్: ఇరాన్(Iran) ఇవాళ స్పేస్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. సామన్-1 స్పేస్ టగ్‌ను పరీక్షించినట్లు ఇరాన్ మిలిటరీ ఇవాళ తన ట్వీట్ ద్వారా ప్రకటించింది. సిమోర్గ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సామన్-1ను ప్రయోగించారు. దీనితో పాటు రెండు అదనపు పేలోడ్స్‌ను కూడా ప్రయోగించారు. ఇమామ్ ఖోమినేఇ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించినట్లు ఇరాన్ మిలిటరీ వెల్లడించింది.
We have successfully launched the Saman-1 space tug, along with two additional payloads, into orbit aboard the Simorgh launch vehicle from the Imam Khomeini Space Center.
🇮🇷 🚀 pic.twitter.com/KyK3oHHj1O
— Iran Military (@IRIran_Military) December 6, 2024
ఈ ప్రయోగంతో ఇరాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి స్పేస్ టగ్‌ను ప్రయోగించింది. స్వదేశీయంగా డిజైన్ చేసి, ఉత్పత్తి చేశారు. స్వంతగా తయారు చేసిన శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా ఈ పరీక్ష చేపట్టారు. సామన్-1తో పాటు క్యూబ్‌సాట్, ఓ రీసర్చ్ పేలోడ్ కూడా ఉన్నది. భూ కక్ష్యలోకి ఆ పేలోడ్స్‌ను పంపించారు. టూ స్టేజ్ ఎస్ఎల్వీ.. సిమోర్గ్. దీంట్లో ద్రవ ఇంధనం ఉంటుంది. ఇరాన్ రక్షణ శాఖ దీన్ని డెవలప్ చేసింది. సుమారు 300 కిలోల బరువు ఉన్న పేలోడ్స్‌ను సామన్ మోసుకెళ్లింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

