టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదం జరగడానికి ముందు హెలికాప్టర్లో రైసీ ఉన్న దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వీడియోను రిలీజ్ చేసింది. హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ ఆమిర్ అబ్దుల్లాయిన్ కూడా దాంట్లో ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. హెలికాప్టర్ బయలుదేరిన 30 నిమిషాల తర్వాత దాంట్లో కాంటాక్టు పోయింది. ప్రమాదం జరిగిన 16 గంటల తర్వాత హెలికాప్టర్‌కు చెందిన శిథిల భాగం ఒకదాన్ని సమీప పర్వత శ్రేణుల్లో గుర్తించారు. హెలికాప్టర్ కూలిన ఘటనను ఇరాన్ మీడియా ప్రమాదంగా వర్ణించింది.
ایرانی صدر ابراہیم رئیسائی کا آخری سفر، ہیلی کاپٹر حادثے سے پہلے ڈیم کے فضائی دورے کی ویڈیو۔۔!!#Iran pic.twitter.com/LOn5h1Lsdq
— Khurram Iqbal (@khurram143) May 20, 2024