Vladimir Putin: పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు
Vladimir Putin:పుతిన్‌ను అరెస్టు చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాల కింద అతనికి వారెంట్ జారీ అయ్యింది. ఉక్రెయిన్‌లో ఉన్న పిల్లల్ని అక్రమంగా రష్యాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హేగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు అరెస్టు వారెంట్ జారీ చేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC). ఉక్రెయిన్ యుద్ధ నేరాల(War Crimes)పై ఆయనకు శుక్రవారం ఈ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉక్రెయిన్(Ukraine)లోని పిల్లల్ని చట్టవ్యతిరేకంగా డిపోర్ట్(Deport) చేసినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేగ్‌లోని ఐసీసీ.. రష్యాకు చెందిన చిల్డ్రన్ రైట్స్ కమీషనర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన ఆ ఆదేశాలను రష్యా(Russia) అధికారులు కొట్టిపారేశారు. ఐసీసీలో రష్యాకు భాగస్వామ్యం లేదని అన్నారు. కానీ ఐసీసీ ఇచ్చిన తీర్పును ఉక్రెయిన్ స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని జెలెన్స్కీ(Zelensky) అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 16 వేల మంది చిన్నారుల్ని అక్రమ రీతిలో రష్యాకు డిపోర్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఒకవేళ పుతిన్ ఏదైనా ఐసీసీ సభ్య దేశంలో అడుగుపెడితే, అప్పుడు అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్(Karim Khan) తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీసీ ప్రెసిడెంట్ పియోటర్ హాఫ్మన్స్కీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

