Aswin Sekhar: గ్రహశకలానికి భారతీయుడి పేరుపెట్టిన ఐఏయూ
Aswin Sekhar: కేరళకు చెందిన అశ్విన్ శేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఓ గ్రహశకలానికి ఆయన పేరును ఐఏయూ ఫిక్స్ చేసింది. జూన్ 21వ తేదీన ఆరిజోనాలో జరిగిన కార్యక్రమంలో ఆ పేరును ప్రకటించారు. ఐఏయూలో వివిధ దేశాలకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఉంటారు.
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(ఐఏయూ) ఓ చిన్న గ్రహానికి .. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరును ఫిక్స్ చేసింది. ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్(Aswin Sekhar) పేరును ఆ గ్రహానికి పెట్టారు. గ్రహశకలాలను చిన్నపాటి గ్రహాలను గుర్తిస్తారు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో జరిగిన ఆస్టిరాయిడ్స్ కామెట్స్ మెటియోర్స్ కాన్ఫరెన్స్‌లో మలయాళీ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్‌కు గౌరవం దక్కింది. ఆధునిక భారతీయ చరిత్రలో అశ్విన్ శేకర్(బీ.1985) ఓ ప్రొఫెషనల్ ఉల్కా శాస్త్రవేత్త అని, ఉల్కలు.. గ్రహశకలాలకు చెందిన అంశాల్లో ఆయన ఎంతో అధ్యయనం చేశారని ఐఏయూ తన ప్రశంసా పత్రంలో పేర్కొన్నది. గతంలో కేవలం అయిదుగురు భారతీయులకు మాత్రమే ఆ గౌరవం దక్కింది. నోబెల్ గ్రహీతలు సుబ్రమణ్య చంద్రశేకర్, సీవీ రామన్‌తో పాటు శ్రీనివాస రామానుజన్, విక్రమ్ సారాభాయ్, మనాలి కల్లత్ వైను బప్పులకు ఖగోళ శాస్త్రవేత్తల నుంచి గుర్తింపు దక్కింది.
పారిస్ అబ్జర్వేటరీ సెంటర్లో ప్రస్తుతం అశ్విన్ ఓ ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కింద ఆ విభాగం పనిచేస్తుంది. గ్రహశకలాలు, తోక చుక్కలు, ఉల్కలను స్టడీ చేయడమే తన వృత్తి ధర్మమమని అశ్విన్ పేర్కొన్నారు. సోలార్ సిస్టమ్ డైనామిసిస్ట్గా తన వర్క్ ప్రొఫైల్ ఉంటుందన్నారు. భూమిని ఢీకొట్టే వస్తువుల గురించి స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ లేదా అంతకన్నా ఎక్కువగా చదివిని ప్రొఫెషనల్ ఖగోళ శాస్త్రవేత్తలు ఐఏయూలో సభ్యులుగా ఉంటారు. వారంతా అశ్విన్‌ను ప్రశంసించారు. ఖగోళంలో కనిపించే వస్తువులకు ఈ బృందం శాస్త్రవేత్తలే నామకరణం చేస్తుంటారు. దీనిలో భాగంగా జూన్ 21వ తేదీన కొన్ని గ్రహశకలాలకు పేర్లు పెట్టారు. ఆ సమయంలోనే అశ్విన్ పేరును కూడా ప్రకటించారు.
అశ్విన్ పేరుతో ఉన్న ఆస్టరాయిడ్‌ను 2000 సంవత్సరంలో గుర్తించారు. ఆరిజోనాలోని అబ్జర్వేటరీ నుంచి దాన్ని పసికట్టారు. ఇక నుంచి ఆ గ్రహశకలాన్ని (33928 ) అశ్విన్శేఖర్= 2000 LJ27గా పిలువనున్నారు. డేటాబేస్ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా 33928 నెంబర్‌ను ఇచ్చారు. టైటిల్లో ఉన్న 2000 సంఖ్య.. అది ఆ ప్లానెట్ను గుర్తించిన సంవత్సరం. ఇక ఎల్జే అంటే ఆ శకలాన్ని గుర్తించిన నెల, వారానికి చెందిన కోడ్. ఇప్పటి వరకు 8 లక్షల చిన్నపాటి గ్రహాలను గుర్తించారు. అయితే ప్రమాదం కానటువంటి వాటికి మాత్రమే శాస్త్రవేత్తల పేర్లను ఫిక్స్ చేస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

