Inland Taipan | ఈ ప్రపంచంలో 600 విషపూరిత పాములు ఉన్నప్పటికీ, కేవలం 200 పాములు మాత్రమే అత్యంత విషపూరితమైనవి అని తేలింది. ఈ 200 పాములు కాటేస్తే మనషుల ప్రాణాలకే ముప్పు. అయితే ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. ఒక వేళ ఈ పాము ఒక్కసారి కాటేస్తే 100 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పాముకు ఇన్‌ల్యాండ్ తైపాన్ అని పేరు. దీన్ని ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇది. దీని తల దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇక ఉదయం వేళ తైపాన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము విషం చాలా ప్రభావవంతమైనది అని యూనివర్సిటీ ఆప్ బ్రిస్టల్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ వెబ్సైట్లో పేర్కొన్నారు. పాముల విషాన్ని ఎల్డీ50 స్కేల్ రూపంలో కొలుస్తారు. అయితే ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము ఒక్కసారి 110 మిల్లీగ్రాముల విషాన్ని విసర్జిస్తుంది. అంటే ఒక్క బైట్‌లో దాదాపు 100 మందిని చంపేందుకు ఆస్కారం ఉంటుంది. లేదా 2,50,000 ఎలుకలు మరణించే అవకాశం ఉంది.