IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
IndiGo : సౌదీలోని ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇండియా నుంచి సౌదీకి, అలాగే సౌదీ నుంచి ఇండియాకు వచ్చే విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
IndiGo : సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సౌదీలోని ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాకు చెందిన విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి సౌదీకి, అలాగే సౌదీ నుంచి ఇండియాకు వచ్చే విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
అక్టోబర్ 17 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది. దీని ప్రకారం సౌదీ రాజధాని రియాద్, జెద్దా, దమ్మాం, మదీనా ఎయిర్‌పోర్టుల నుంచి ఇండియాకు.. ఇండియా నుంచి ఆ ఎయిర్‌పోర్టులకు ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం సౌదీలో నెలకొన్న ఆందోళనకర పరిస్తితుల నేపథ్యంలో ఇండిగో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించింది. అలాగే, పూర్తి వివరాల కోసం, విమాన సర్వీసుల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ప్రయాణికుల అభ్యంతరాలపై సమాచారం అందించేందుకు సపోర్ట్ టీం అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇండిగో సంస్థ మాత్రమే కాకుండా ఇతర విమానయాన సంస్తలు కూడా ఆయా ప్రాంతాలకు విమాన సర్వీసుల్ని నిలిపివేశాయి. సౌదీలోని రెండో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అయిన కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సహా ఇతర ఎయిర్‌పోర్టులపై హౌతీ ఉగ్రవాదులు బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు.
దీంతో అనేక ఎయిర్‌పోర్టుల నుంచి విమానయాన సేవలు నిలిచిపోయాయి. హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా.. యెమెన్ ప్రభుత్వానికి అండగా ఉంటోంది. యెమెన్‌లోని తిరుగుబాటు సైన్యమే హౌతీలు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

