కాలిఫోర్నియా: అమెరికాలో ఈ నెల 9న అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కన్పించాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీలో చదువుతున్న 22 ఏండ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఈ నెల 9 నుంచి అదృశ్యమయ్యాడు. అతను మృతదేహమై కన్పించినట్టు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది.
శ్రీనివాసయ్య చివరిసారిగా బర్క్లీహిల్స్లోని అనాజ లేక్ సమీపంలో కన్పించాడు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ ఉన్న అతడి బ్యాగ్ పొరుగున ఉన్న వారి ఇంటి గుమ్మం ముందు కన్పించింది. కర్ణాటకకు చెందిన శ్రీనివాసయ్య ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు యూసీ బర్క్లీలో కెమికల్, బయో మాలిక్యులర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు.