Umrah Pilgrim : నేటి నుంచి ఉమ్రాకు సౌదీ అనుమతి
Umrah Pilgrim : ఉమ్రాను సందర్శించేందుకు పర్యాటకులకు సౌదీ అరేబియా అనుమతించింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఇవాల్టి నుంచి ఉమ్రాలోకి అనుమతిస్తారు. ఈ మేరకు సౌదీ అరేబియా ప్రభుత్వం

జెడ్డా : ఉమ్రాను సందర్శించేందుకు పర్యాటకులకు సౌదీ అరేబియా అనుమతించింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఇవాల్టి నుంచి ఉమ్రా (Umrah Pilgrim) లోకి అనుమతిస్తారు. ఈ మేరకు సౌదీ అరేబియా ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. వివిధ దేశాల ప్రజలు రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించిన అక్కడి ప్రభుత్వం.. సరిగ్గా 18 నెలల అనంతరం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. దాంతో అన్ని దేశాల వారికి ఉమ్రాలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుచిక్కింది. ప్రతి నెలా వ్యాక్సిన్ తీసుకున్న 20 లక్షల మందికి ఉమ్రాకు అనుమతించనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో భారతదేశం సహా 20 దేశాల ప్రజలు సౌదీకి రాకుండా ప్రయాణ నిషేధాజ్ఞలు విధించారు. ఆ తర్వాత 11 దేశాలపై నిషేధం ఎత్తివేయగా.. భారత్, పాకిస్తాన్‌తోపాటు మరో 7 దేశాల పర్యాటకుల ప్రయాణంపై నిషేధం కొనసాగించారు. కాగా, ఆ నిషేధాన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. అయితే, ఉమ్రాకు అనుమతి పొందేందుకు సౌదీ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలి. అవసరమైన పక్షంలో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండేందుకు కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న స్థానిక 12-18 ఏండ్ల మధ్య వయసు వారిని అనుమతిస్తున్నట్లు హజ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇటీవల హజ్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఉమ్రా ప్రవేశానికి సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హజ్‌కు కేవలం 60 వేల మందినే అనుమతించారు. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కారణంగా సౌదీ అరేబియా ఏటా రూ.89 వేల కోట్లు ఆర్జించేది. సౌదీ ప్రభుత్వం ఉమ్రాను ఏదాడి పొడవునా నిర్వహిస్తుంది. నెలలో 14 రోజులపాటు ఉమ్రాలోకి అనుమతిస్తారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఉమ్రాను సందర్శించేందుకు ముస్లింలు ఇష్టపడతారు. కాగా, ఇప్పటివరకు సౌదీ అరేబియాలో 5.32 లక్షల కేసులు నమోదవగా, 8,300 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి..
ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
ఇలా నీరజ్ ‘పసిడి’కి గుర్తింపు..
నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన సంజయ్‌లీలా భన్సాలీ
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

