కాలిఫోర్నియా : భారత సంతతికి చెందిన యువతిని ఓ దుండగుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్చి చంపేశాడు. షాలిని (38) వెయిట్రెస్‌గా పనిచేస్తున్నది. ఆమె పనిచేసే చోటుకు వచ్చిన రోహిత్ (22) పరిచయం అయ్యాడు. షాలినిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. వయసు తేడా కారణంగా అతన్ని షాలిని తిరస్కరించింది.
దీంతో కక్ష పెంచుకున్న రోహిత్ శుక్రవారం షాలినిని వెంటాడి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చుట్టుముట్టగా.. హైవే మీద కారు ఆపి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. రోహిత్ అక్రమ వలసదారుడని పోలీసులు గుర్తించారు. అతను గతంలో అరిజోనాలో అక్రమ చొరబాటు కారణంగా జైలుకు వెళ్లాడు. హత్య జరగడానికి గంట ముందు కూడా షాలిని తనతో మాట్లాడిందని.. మళ్లీ చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఇలా జరిగిందని ఆమె తల్లి సుదేష్ కుమారి చెప్పారు.