అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య
Student killed: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏండ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇండియానాపోలిస్‌కు చెందిన భారత సంతతి విద్యార్థి వరుణ్ మనీష్
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏండ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇండియానాపోలిస్‌కు చెందిన భారత సంతతి విద్యార్థి వరుణ్ మనీష్ చద్దా ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో డాటాసైన్స్ చదువుతూ.. వర్సిటీ క్యాంపస్‌లోని మెక్‌కట్చియోన్ హాల్లోగల ఓ గదిలో కొరియన్ రూమ్మేట్ జీ మిన్ జిమ్మీ షాతో ఉంటున్నాడు. జిమ్మీ షా సైబర్ సెక్యూరిటీ కోర్సు చదువుతున్నాడు.
ఈ క్రమంలో చద్దా బుధవారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున 12.45 గంటలకు జిమ్మీ షా 911 నంబర్ ద్వారా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై పదునైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, మంగళవారం రాత్రి ఫోన్ చేసినప్పుడు చద్దా అరుపులు, కేకలు వినిపించాయని అతని చిన్ననాటి స్నేహితుడు అరునబ్ సిన్హా తెలిపాడు.
అయితే, మంగళవారం రాత్రి తాను ఫోన్ చేయలేదని, ఫోన్ చేసిన ఇతర మిత్రులు తనకు ఈ విషయం చెప్పారని సిన్హా వివరించాడు. దాంతో పోలీసులు చద్దా రూమ్మేట్ జిమ్మీ షాను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

