Sunita Williams: స్సేస్ స్టేషన్ కమాండర్‌గా సునీతా విలియమ్స్
Sunita Williams : స్సేస్ స్టేషన్ కమాండర్‌గా సునీతా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించింది. రష్యా కాస్మోనాట్ ఓలెగ్ ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు నాసా ప్రకటించింది. స్పేస్ స్టేషన్‌కు రెండోసారి సునీతా కమాండర్ అయ్యారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో సునీతా విలియమ్స్(Sunita Williams) చిక్కుకున్న విషయం తెలిసిందే. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన ఆమె.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ సమస్య వల్లే 8 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్‌కు కమాండర్‌గా మారింది సునీతా విలియమ్స్. రష్యా కాస్మోనాట్ ఓలెగ్ కోనెనెంకో ఆ కమాండ్‌ను సునీతాకు అప్పగించినట్లు నాసా ప్రకటించింది. కమాండర్ బాధ్యతలు అప్పగింత సమయంలో స్పేస్ స్టేషన్లో ఓ సెర్మనీ కూడా జరిగింది. కోనెనెంకో స్పేస్ స్టేషన్‌కు వెళ్లి ఏడాది కావోస్తోంది. అతని తో పాటు ట్రేసీ డైసన్, నికోలయి చుబ్లు కూడా త్వరలో భూమికి తిరిగిరానున్నారు. స్పేస్ స్టేషన్‌లోని మైక్రోగ్రావిటీ ల్యాబ్‌లో సునీతా వర్క్ చేస్తున్నది. మానవ, రోబోటిక్ మిషన్స్‌కు చెందిన టెక్నాలజీపై ఆమె సైంటిఫిక్ స్టడీ చేస్తున్నది. స్పేస్ స్టేషన్ కమాండ్‌ను సునీతా స్వీకరించడం ఇది రెండోసారి. 12 ఏళ్ల క్రితం కూడా ఆమె ఆ బాధ్యతలు నిర్వర్తించారు. స్పేస్ స్టేషన్లో భద్రతను చూసుకోవడమే ఆమె కీలక బాధ్యత అవుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

