LPG Vessels | హర్మూజ్ జలసంధిని దాటి భారత్‌కు వస్తున్న మరో రెండు ఎల్పీజీ నౌకలు.. గ్యాస్ కొరతకు మరికొంత ఉపశమనం
LPG Vessels | దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. భారత్‌కు చెందిన ఎల్పీజీ (LPG), ముడి చమురు (Crude Oil) నౌకలు ఒక్కక్కటిగా హర్మూజ్ జలసంధి (Strait of Harmuz) ని దాటుతుండటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నది. తాజాగా మరో రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి.
LPG Vessels : దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. భారత్‌కు చెందిన ఎల్పీజీ (LPG), ముడి చమురు (Crude Oil) నౌకలు ఒక్కక్కటిగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటుతుండటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నది. తాజాగా మరో రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుమతితో జగ్ వసంత్ (Jag Vasant), పైన్ గ్యాస్ (Pine Gas) అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరనున్నాయి. దాంతో దేశీయంగా వంట గ్యాస్ లభ్యత మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఫలితంగా కొన్ని రోజుల నుంచి భారత నౌకలు ఒక్కొక్కటిగా దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి. అయితే, ఇరాన్ సీనియర్ లీడర్ అలీ లారిజానీ మరణం, ఆ దేశ చమురుక్షేత్రాలపై అమెరికా దాడులు వంటి కారణాలతో నౌకల ప్రయాణానికి అనుమతులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

