ఒట్టావా: విదేశాల్లో భారతీయులు, భారత సంతతి పౌరులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 28 ఏండ్ల భారత సంతతి పౌరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్‌చేశారు. జూన్ 7న సర్రేలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని, గుర్తు తెలియని కొంతమంది యువరాజ్ గోయల్‌పై కాల్పులు జరిపి ఈ హత్యకు పాల్పడ్డారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సోమవారం తెలిపింది.