Cannes Film Festival | కేన్స్‌లో వెలిగిన ‘భారత’ సినిమా.. వేర్వేరు క్యాటగిరిల్లో మూడు అవార్డులు
Cannes Film Festival | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. వేర్వేరు క్యాటగిరిలో భారతీయులు మూడు అవార్డులు దక్కించుకున్నారు.
- ‘ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్’ చిత్రానికి ప్రతిష్ఠాత్మక గ్రాండ్ప్రిక్స్ అవార్డు
- ఉత్తమ నటిగా అనసూయాసేన్
కేన్స్, మే 26: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. వేర్వేరు క్యాటగిరిలో భారతీయులు మూడు అవార్డులు దక్కించుకున్నారు. శనివారం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 ముగిసింది. ఇందులో కొత్త దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్’ చిత్రానికి గ్రాండ్ప్రిక్స్ అవార్డు దక్కింది. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బహుకరించే రెండో అత్యుత్తమ అవార్డు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల్లో గ్రాండ్ప్రిక్స్ అవార్డును దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ఇది.
పాయల్ కపాడియా ఫిల్మ్ ఆండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) పూర్వ విద్యార్థిని. ఇక, ‘ద షేమ్‌లెస్’ చిత్రంలో తన నటనకు గానూ అనసూయసేన్ గుప్తా ‘అన్ సైర్టెన్ రిగార్డ్’ విభాగంలో ఉత్తమ నటి అవార్డును సాధించారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ నటి ఆమె. ఈ చిత్రాన్ని బల్గేరియా దర్శకుడు కన్స్టాన్టిన్ బోజనోవ్ తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైనర్ అయిన అనసూయసేన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఎఫ్టీఐఐ విద్యార్థి చిదానంద ఎస్ నాయక్ దర్శకత్వం వహించిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ధి ఫస్ట్ వన్స్ టు నో’ చిత్రం స్టూడెంట్ డైరెక్టర్ విభాగంలో ‘లా సినెఫ్’ పురస్కారానికి ఎంపికైంది. చిదానంద నాయక్ అవార్డు స్వీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

