Independence Day: అమెరికా గడ్డపై అతిపెద్ద త్రివర్ణ పతాకం ఎగరేయనున్న భారతీయులు
అమెరికాలోని భారతీయులు మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ( Independence Day ) పురస్కరించుకొని అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. న్యూయార్క్( New York )లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ దగ్గర ఈ పంద్రాగస్టు నాడు వాళ్లు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

న్యూయార్క్: అమెరికాలోని భారతీయులు మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ( Independence Day ) పురస్కరించుకొని అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. న్యూయార్క్( New York )లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ దగ్గర ఈ పంద్రాగస్టు నాడు వాళ్లు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆ రోజు మొత్తం వేడుకలు జరపాలని నిర్ణయించింది. 24 గంటల పాటు టైమ్ స్క్వేర్ దగ్గర ఇండియా డే బిల్‌బోర్డ్‌ను ప్రదర్శించనున్నారు. ఇక ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణాల్లో మెరిసిపోనుంది. ఆ రోజు సాయంత్రం హడ్సన్ నదిలో క్రూజ్ షిప్‌పై ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేశార. దీనికి అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా హాజరవుతున్నారు.
ఈ జెండా.. ఎంత పెద్దది?
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ గతేడాది తొలిసారి టైమ్స్ స్క్వేర్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇక నుంచి ఇక్కడ ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ చైర్మన్ అంకుర్ వైద్య చెప్పారు. ఈ ఏడాది టైమ్స్ స్క్వేర్‌లో అతి పెద్ద జెండాను ఎగరేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ జెండా 6 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండటంతోపాటు 25 అడుగుల ఎత్తున్న జెండా కర్రపై దర్జాగా ఎగరనుంది. ఈ అతిపెద్ద జెండాను న్యూయార్క్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రణ్‌దీర్ జైశ్వాల్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలో యంగెస్ట్ గ్రాండ్‌మాస్టర్, ఇండియన్-అమెరికన్ అభిమన్యు మిశ్రా కూడా పాల్గొననున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

