ఇండో పసిఫిక్‌కు భారత్ టీకా
- మెగా వ్యాక్సిన్ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం
- చైనా వ్యాక్సిన్ దౌత్యానికి కౌంటర్
- క్వాడ్ దేశాధినేతల తొలి శిఖరాగ్ర సమావేశం
న్యూఢిల్లీ, మార్చి 12: చైనా వ్యాక్సిన్ దౌత్యానికి దీటుగా చతుర్భుజ కూటమి దేశాలు (క్వాడ్- భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా భారత్ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా భారత్‌లో తయారైన టీకాలను ఇండో పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇందుకు అమెరికా, జపాన్ ఆర్థిక తోడ్పాటును, ఆస్ట్రేలియా లాజిస్టిక్స్ సహకారాన్ని అందించనున్నాయి. 2022 నాటికి 100కోట్ల్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్వాడ్ దేశాధినేతలు భారత ప్రధాన నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా శుక్రవారం వర్చువల్ మాధ్యమంలో నిర్వహించిన తొలి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు ఈ సందర్భంగా క్వాడ్ నేతలు స్పష్టమైన సందేశాన్ని పంపారు. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంతమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్య విలువలతో మనమంతా ఏకమయ్యామని, స్వేచ్ఛాయుత, సమీకృత ఇండో పసిఫిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ అనాదిగా విశ్వసిస్తున్న వసుధైక కుటుంబమనే భావనకు ఈ సమావేశం కొనసాగింపు అని, సుస్థిర, సురక్షిత, సుసంపన్న ఇండో పసిఫిక్ సాకారానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. క్వాడ్ పూర్తిగా రూపుదిద్దుకున్నదని, ఇండో పసిఫిక్ ప్రాంత సుస్థిరతకు ఇది కీలక స్తంభంగా నిలుస్తుందని చెప్పారు. స్వేచ్చాయుత ఇండో పసిఫిక్ మన అందరికీ కీలకమని, ఈ ప్రాంతంలో సుస్థిరత సాధనకు భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. టీకా కార్యక్రమం ద్వారా అమెరికా వ్యాక్సిన్లను భారత్‌లో తయారు చేయనున్నట్టు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మీడియా సమావేశంలో తెలిపారు.
థర్డ్‌పార్టీని లక్ష్యంగా చేసుకోరాదు: చైనా
క్వాడ్ సదస్సుపై చైనా పెదవి విరిచింది. దేశాల మధ్య ఒప్పందాలు, సహకారం ఆయా దేశాల ప్రయోజనాలు, వాటి మధ్య విశ్వాసాన్ని పెంపొందించేలా ఉండాలి కానీ ‘థర్డ్ పార్టీ’ని (వేరొక దేశాన్ని) లక్ష్యంగా చేసుకోరాదని పేర్కొన్నది. పారదర్శకత, సమగ్రత, పరస్పర ప్రయోజనం సూత్రాలకు అనుగుణంగా క్వాడ్ దేశాలు నడుచుకుంటాయని భావిస్తున్నామని, ప్రాంతీయశాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం పనిచేస్తాయని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

