US president | నాకు ప్రపంచంలో అతి ముఖ్యమైన దేశం భారత్: అమెరికా అధ్యక్షుడు బైడెన్
US president | ప్రపంచంలో తనకు అత్యంత ముఖ్యమైన దేశం భారత దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ విషయాన్ని భారత దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలో తనకు అత్యంత ముఖ్యమైన దేశం భారత దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ విషయాన్ని భారత దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. తనను భారత దేశానికి అమెరికా రాయబారిగా నియమించిన సమయంలో బైడెన్ తనతో మాట్లాడుతూ.. తనకు భారత దేశమంటే చాలా ఇష్టమని, ఈ ప్రపంచంలో తనకు అత్యంత ముఖ్యమైన దేశం భారత దేశమేనని చెప్పాడని గార్సెట్టీ గుర్తుచేశారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఎరిక్ గార్సెట్టీ ఈ విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రలో మరే అమెరికా అధ్యక్షుడు కూడా భారత దేశం తనకు అత్యంత ముఖ్యమైనది అని చెప్పి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఎప్పుడైనా స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయన్నారు. అమెరికాలో పన్నులు చెల్లించేవారిలో 6 శాతం మంది ఇండో అమెరికన్లే ఉన్నారని చెప్పారు.
రెండు దేశాల మధ్య సాంకేతికత నుంచి వాణిజ్యం వరకు, పర్యావరణం నుంచి మహిళా సాధికారత వరకు, చిరు వ్యాపారాల నుంచి అంతరిక్ష వ్యవహారాల వరకు అన్నింటిలో మంచి సంబంధాలే ఉన్నాయని గార్సెట్టి పేర్కొన్నారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో భారత్, అమెరికా దేశాలు రెండు బలీయమైన శక్తులని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

