యూఎన్ మిషన్‌లో చేరిన అతిపెద్ద భారత వుమెన్ పీస్‌కీపర్స్ దళం
Women Peacekeepers భారత్‌కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ ఇప్పుడు యూఎన్ మిషన్‌లో భాగం కానున్నది. యునైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూర్టీ ఫోర్స్(యూఎన్ఐఎస్ఎఫ్ఏ)లో భాగమైన భారత వుమెన్ పీస్‌కీపర్స్ ప్లాటూన్ సుడాన్‌లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించనున్నది. యూఎన్ ప్రోగ్రామ్‌లో పాల్గొం
న్యూయార్క్: భారత్‌కు చెందిన అతిపెద్ద మహిళా బెటాలియన్ ఇప్పుడు యూఎన్ మిషన్‌లో భాగం కానున్నది. యునైటెడ్ నేషన్స్ ఇంటీరియమ్ సెక్యూర్టీ ఫోర్స్(యూఎన్ఐఎస్ఎఫ్ఏ)లో భాగమైన భారత వుమెన్ పీస్‌కీపర్స్ ప్లాటూన్ సుడాన్‌లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వర్తించనున్నది. యూఎన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న అతిపెద్ద భారతీయ మహిళా యూనిట్ ఇదే కావడం విశేషం.
గతంలో 2007లో లిబేరియాలో భారత మహిళా దళం విధులు నిర్వర్తించింది. లిబేరియాలో ఆ మహిళా దళం 24 గంటల పాటు గార్డు డ్యూటీ చేసింది. రాజధాని మోన్రోవియాలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించారు. తాజా భారత మహిళా బృందంలో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు. మరో 25 మంది ఇతర ర్యాంక్‌ల వాళ్లు ఉంటారని తెలిపారు.
సుడాన్‌లోని అబేయ్ ప్రావిన్సులో విధులు చేపట్టడం సవాల్‌తో కూడుకున్న పని. అక్కడ తాజాగా జరిగిన హింస వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం హింస జరిగే ప్రాంతంలో మహిళా దళాలను మోహరించడం సవాలే. కానీ యూఎన్ పీస్ కీపింగ్ మిషన్‌కు మన బృందాన్ని పంపడం గొప్ప విషయం.
1948 నుంచి ఇప్పటి వరకు 71 యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్లను నిర్వహించారు. దాంట్లో 49 మిషన్ల కోసం సుమారు రెండు లక్షల మంది భారతీయుల్ని పంపారు. యూఎన్ పీస్‌కీపింగ్ ప్రోగ్రామ్‌కు భారతీయ మహిళల్ని పంపే సాంప్రదాయం 1960 నుంచి ఉంది. పీస్‌కీపింగ్ మిషన్‌లో భారతీయ మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్ కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తి దేవి లాంటి వాళ్లు యూఎన్ పీస్‌కీపింగ్‌లో చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

